పాఠాల కొరకు

గ్రూప్ - I (6-9 సం.లు)
ప్రతి విద్యార్థికి నేర్చుకునే దశ ఇది. "తొందరగా బయలుదేరు, నెమ్మదిగా ప్రయాణించు, క్షేమంగా చేరు" ఇది శిక్షణ బాలా దివ్య సూక్తి. ఆ ఉద్దేశంతో బాలవికాస్ కార్యక్రమమును 6 ఏండ్ల వయసు గల బాల,బాలికలకు ప్రారంభిస్తారు. చిన్న వయసులో నేర్చుకొన్న విషయాలు జీవితమంతా గుర్తుండి వ్యక్తి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అందుకే బాలవికాస్ గురువులు ఆటలు, పాటలు, బృంద కార్యక్రమాలు, కథలు, ప్రార్థనలు, మౌనంగా ఉండుట, మొదలైన పద్ధతుల ద్వారా విధ్యార్థి వికాసానికి ప్రయత్నించాలి. పాఠాలు, ఉపన్యాసాలు ఈ దశలో ఉపయోగపడవు.